Thursday, May 7, 2009

డిజిటల్ ఎస్. ఎల్. ఆర్ ( D-SLR ) కెమెరా లు

డిజిటల్ ఎస్.ఎల్.ఆర్ కెమెరా అంటే ఆ కెమెరా లో ఒక అద్దం సహాయం తోటి తీయబోయే దృశ్యం కరెక్ట్ గా చూపిస్తుంది. ఈ పక్క బొమ్మ లో చూపించినట్టు ఒక రకమయిన అద్దం సహాయంతోటి. ఏ విధయయిన ఎలక్ట్రానిక్ అద్దాలు వాడదు. ఈ విధమయిన సదుపాయం మొత్తం ఒక సెకను లో వేల వంతు సమయాల్లో చేసేస్తుంది. దీంతో, సాధారణ కెమెరాలలో దృశ్యం పూర్తి గా చూపించడానికి మనం ఆగే సమయం ఇందులో అవసరం లేదు. దృశ్యం చూడగానే, ఈ కెమెరా ద్రుష్టి పెట్టేసి, దానిని కెమెరా వెనుక పక్క వుండే అద్దం లో నుండి చూపిస్తుంది. కాబట్టి, దీన్లో ఫోటో లు తీయడం చాలా వేగంగా జరుగుతుంది. ఈ సదుపాయం ఈ కెమెరా లకి ఈ పేరు తెచ్చి పెట్టినా, దీనితో పాటుగా ఇంకా కొన్ని చెప్పుకో వలసిన విషయాలు వున్నాయి. అవి :
  • కెమెరా లెన్స్ లని మార్చుకో వచ్చు. సందర్భానికి తగ్గట్టు గా వేర్వేరు లెన్స్ లను అతికించుకుని వాడుకో వచ్చు.
  • దృశ్య గ్రాహకాలు చాలా ఎక్కువ సామర్థ్యం తోటి, మరియు నాణ్యం గా తయారు చేయ బడతాయి.
ఈ విధమయిన సదుపాయాల వలన మనం అత్యంత నాణ్యమయిన ఫోటో లు అన్ని సందర్భాలలో తీయవచ్చు. అది కూడా అతి కొద్ది సమయాల్లోనే. ఇంకనూ ఒక విషయం... వీటి వస్తువులు చూడ ముచ్చట గానూ అప్పుడే అభివృద్ధి చేసినవి గాను వుంటాయి. కాబట్టి అవన్నీ మంచి ఫోటోలు నాణ్యమైన వివరం తోటి వచ్చే విధం గా తోడ్పడతాయి. వీటి రిసోల్యుషన్ లకు ఇంక ధోకా యే  లేదు. ఇవి 6MP నుండి మొదలుకుని,  22MP  వరకు లభ్యమవుతాయి. 

వీటన్నిటితో పాటుగా రాయి లాంటి బిగువు, బిర్రుగా వుండే విధం గా తయారు చేయ బడిన దేహం, మనకు విపరీతమయిన వాతావరణాలలో ఫోటో లు తీయడానికి ఉపయోగ పడతాయి. వీటి లెన్స్ ల మీద దుమ్ము పడ్డా కూడా చక్కగా కాంతిని గ్రహించే లాగా తయారు తయారు చేస్తారు. మబ్బుగా వుండే సందర్భాలు, మంచి తుఫాన్ లాంటి సందర్భాల్లో దీనిని వాడొచ్చు. వీటి బటన్లు , కవర్లు (తొడుగులు) మట్టికి, తడికి తొందరగా పాడు కాకుండా తయారు చేయ బడతాయి.

ఇవే డిజిటల్ కెమెరా ల విభాగం లో అత్యంత ఖరీదయినవి. బ్రిడ్జి కెమెరా లు వీటి లగే వుంటాయి కానీ, ఇవి వేరు అనే విషయమా మీరు గుర్తు పెట్టుకోవాలి.