Wednesday, April 1, 2009

ఎన్ని మెగా పిక్సెల్సు ? MP, The Mega Pixel buzz

అమ్మకం దారు మాటలు వినే సందర్భం లో మీరు తరచూ గా ఈ మెగా పిక్సెల్స్ అనే పదం విరివిగా వాడడం గమనిస్తారు. ఇవి చాలా ముఖ్యమయిన అంశం. అందుకని ఈ ఉత్తరం లో మీకు అవంటే ఏంటో, మీకేన్ని కావాలో, వివరిస్తాం.

ఒక డిజిటల్ కెమెరా ఒక ప్రత్యేకమయిన గ్రాహ్యము ( Sensor ) ని కలిగి వుంటుంది. దీనినే శాస్త్రీయ పద్దతి లో CCD అని పిలుస్తారు. (Charge Coupled Device)  అంటే దీన్లో విద్యుత్ నిల్వ ఉంచిన పదార్థాల్ని ఇరికించి తయారు చేస్తారు. ఇది సంప్రదాయక ఫిలిం ఎదైతో వుందో, దానికి బదులు అనమాట. మనం ఏ ఫోటో లు తీయాలన్న దీనిలో నేరుగా తయారు చేయ బడతాయి. ఈ గ్త్రాహ్యము అనేకనేకమయిన దృశ్య గ్రహకాలని కలిగి వుంటుంది. ఇవి వివిధ రకాలయిన కాంతి ని గ్రహించి, ఆ కాంతి ని ఎలక్ట్రానిక్ రూపం లోకి మర్చి, దాని కెమెరా లో వుండే కంప్యూటర్ కి ఇస్తుంది. ఇహ ఇప్పుడు ఫోటో తయార్. నేరుగా తీసిన ఫోటో ని కెమెరా రంగుల స్క్రీన్ మీద గాని, లేదా కంప్యూటర్ కి తగలించి నేరుగా కంప్యూటర్ లోనయిన చూసుకోవచ్చు. లేదు మనకి ముద్ర ప్రతి కావాలంటే, నేరుగా ముద్రించుకోవచ్చు కాగితం మీద. డిజిటల్ కెమెరా తోటి ఫోటో తీయడం అంత తేలిక.

ఒక పిక్చర్ ఎలిమెంట్ ( పిక్సెల్ ) అనేది ఒక అతి సుక్ష్మమయిన, సస్త్రయుక్తంగా విభజించ గలిగిన స్తలం. అది డిజిటల్ కెమెరా ల లోని విద్యుత్ గ్రాహకాల ద్వారా, కాంతి ని ఎలక్ట్రానిక్ రూపం లో కెమెరా లోకి పంపించ గలుగుతుంది. ఇటువంటి పిక్సెల్సు ఎన్ని లక్షలు వున్నాయి ? అనేది ఈ ఎన్ని మెగా పిక్సెల్సు ? అన్న ప్రసన కి సమాధానం. ఒక మెగా పిక్సెల్ అంటే, పది లక్షల కాంతి గ్రహకాలనమాట.  మెగా అంటే 10 లక్షలు అని. ఒక మెగా పిక్సెల్ కెమెరా అంటే 10 లక్షల కాంతి గ్రాహకాలు వున్న కెమెరా అనమాట. దీనినే సులువు గా 1MP కెమెరా అంటారు. అంటే 2MP కెమెరాలో 20 లక్షల కాంతి గ్రాహకాలు ఉంటాయన మాట.

ఈ సంఖ్యా చాలా ముఖ్యమయినది. ఎందుకంటే, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్సు వుంటే అంత వివరమయిన ఫోటో తీయవచ్చు. అప్పుడు ఆ ఫోటో లకి రిసోల్యుషన్ ఎక్కువ వుండి అంటారు. రిసోల్యుషన్ అంటే వివరం. పెద్ద తనం. ఇంకొక విషయం ఏమంటే ఎక్కువ మెగా పిక్సెల్సు వుంటే, పెద్ద ముద్రణ కి అవకాశం వుంటుంది. కాగితం మీద ముద్రించాలంటే, ఎక్కువ మెగా పిక్సెల్సు తోటి తీసిన ఫోటో అవసరం. మెగా పిక్సెల్స్ పెరిగే కొద్ది ధర పెరిగే అవకాశం వుందని మీరు గుర్తు పెట్టుకోవాలి.

కాబట్టి, మీరు ఎన్ని మెగా పిక్సెల్సు వుండే కెమెరా కొనాలి ? అనే ప్రసన కి సమాధానం మీ వద్దనే వుంటుంది. మీరు ఏ విధంగా మీ కెమెరా ని వాడతారు ? అనే దాన్ని  బట్టి వుంటుంది. మీరు మాములు గా ఇంటర్నెట్ లో ఫోటో లు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించుకోవడానికే అనుకోండి, మీకు తక్కువ మెగా పిక్సెల్సు డి సరి పోతుంది. (2Mp, 3Mp లాగా). ఈ మెయిల్ లో ఫోటో లు పంపించడం గురించి కావాలంటే, ఈ భాగాన్ని చూడండి  ముద్రణ కోసం కావాలంటే అంతకన్నా ఎక్కువ కావలసి వుంటుంది. మీకు 6x4  అంగుళాల ఫోటో ముద్రణ కావాలంటే, ఒక 2MP  డి సరిపోతుంది.దానినే కొన్ని సార్లు, 8x10 అంగుళాల వలె సగ దీయవచ్చు. ఒక 3MP కెమెరా తోటి ఒక A4  సైజు ముద్రణ ప్రతి ని తయారు చేయ వచ్చు. అదే  4MP దానితోటి A3 సైజు  ముద్రణ చేయవచ్చు.

అందుకని, ఒక 2MP కెమెరా సరిపోతుంది కానీ, మీరు జర్నలిస్ట్ అయ్యో, లేదా ముద్రణ మీద ద్రుష్టి పెట్టవలసిన వారో అయితే మాత్రం, 2MP  ది సరి పోదు. మీరసలు కాగితం ప్రతులే ముద్రించని వారయితే, 2MP - 4MP కెమెరా తీసుకో వచ్చు. ఈ పరిజ్ఞానమంతా పట్టించుకోవలసిన పని లేదు.


ఇక్కడ ఒక ఆనందించ దగ్గ విషయం వుండి. అదేంటంటే, ఎక్కువ మెగా పిక్సెల్సు వున్న, మనకి అవసరం లేక పొతే, వాడకుండా, తక్కువ మెగా పిక్సెల్సు మాత్రమే ఉపయోగించే విధంగా కెమెరా లలో సదుపయలుంటాయి. కాబట్టి మీరు ఎక్కువ కొనాలనే కుతూహలం తోటి కొన్న పరవాలేదు. దీని మీద ఇంట వివరం ఎందుకంటే, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్స్ తోటి ఫోటో తీస్తే, అంత జ్ఞాపకాన్ని మీ కెమెరా వాడుకుంటుంది. ఎంత ఎక్కువ మెగా పిక్సెల్సు ఫోటో తీస్తే అంత వివరం ఇముడుతుంది మన ఫోటో లో. అలాగే అంటే జ్ఞాపక శక్తి ని తినేస్తుంది. మన దగ్గర జ్ఞాపక శక్తి ( కెమెరాలలో పెట్టేది ) కార్డు అయి పొతే, అనవసరంగా దిగులు పద వలసి వుంటుంది. అందుకని, పొడుపు గా, పొందిక గా వాడుకోవాలి ఈ మెగా పిక్సెల్స్ అనే సంఖ్యని.