Saturday, July 25, 2009

డిజిటల్ ఫోటోగ్రఫీ - ఒక పరిచయం

డిజిటల్ ఫోటోగ్రఫీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్ర్యాక్టికల్ గా టెక్నికల్ గా క్రియేటివ్ గా మీ సృజనాత్మకత కు పదును పెట్టుకోవచ్చు. మరియు డబ్బు రూపేణా కూడా సాధారణ రీల్ ఫోటోగ్రఫీ తో పోల్చితే ఉపయోగాలు ఉన్నాయి ఇంకా  ఎన్నో ఆధునికతలు డిజిటల్ ఫోటోగ్రఫీ లో పొందు పర్చబడ్డాయి. మనతో పోల్చితే అభివృద్ధి చెందినవనుకుంటున్న దేశాల్లో 90 శాతం వరకు కామేరా లు డిజిటల్ వే. మన దేశం లో కూడా ఇప్పుడు ఈ సంస్కృతి పుంజుకుంటుంది. కానీ అతి కొద్ది మంది మాత్రమే వాటిలో పొందు పర్చిన ఉపయోగాలని తెలుసుకొని వినియోగించుకో గలుగుతున్నారు. డిజిటల్ కామేరా లతో మీరు  వందలాది ఫోటో లను అతి తక్కువ ధరలలో తీయవచ్చు. తీసి భద్రపరచుకో వచ్చు. అప్పటికప్పూడే పరిశీలించి, మళ్లీ అవసరమయితే ఇంకొక ఫోటో అటువంటిదే కొంచెం శ్రధ్ధ తో తీసుకో వచ్చు. వాటిని భద్ర పరచు కోవచ్చు. చాలా మంచి ఫోటో లను తీయ వచ్చు. కంప్యూటర్ ని ఉపయోగించి వెలుతురు సరిగా లేని ఫోటోలకు వెలుతురు తీసుకు రావచ్చు. మీ పాత ఫోటోలను సారి చేసుకో వచ్చు. రంగులని సారి చేసుకో వచ్చు. లేదా కొన్ని ప్రత్యేకమయిన రంగులను అద్ద వచ్చు. ఫోటో ఆల్బమ్ లను ఆన్‌లైన్ లోన్ పెట్టుకో వచ్చు. పాత రోజుల లో లాగా పెద్ద పెద్ద ఆల్బమ్ లను మోయనవసరము
లేదు.డిజిటల్ కామేరా ల వల్ల ఉపయోగాలు అనేకం. అనేకానేకం.
యాదృచ్చికంగా తీసిన కూడా ఈ ఫోటో చూడండి... చాలా చక్కగా వెనక వున్న ఈఫిల్ శిఖరం మొత్తం ఫోటో లో కనబడేట్టు తీసారు. పిల్లలు ఆడుకున్తున్నప్పుడు తీస్తే ఎటువంటి ఫోతోలయిన చాలా ముచ్చటగా వుంటాయి.
ఈ బ్లాగ్ (లేదా పుస్తకం) మీకు మీ కెమెరా లలో వుండే చాల విషయాలకు అర్థం చెపుతుంది. మీకు ఎటువంటి ముందస్తు పరిజ్ఞానం లేక పోయిన సరే అర్థమయే విధం గ ఈ బ్లాగ్ లో విషయాలను రాశాము. మీరు సరియయిన డిజిటల్ ఫోతోగ్రఫేర్ కావడానికి ఈ బ్లాగ్ తోడ్పడ గలదు.మీరు మీ సెలవుల ట్రిప్ లో ఫోటో లను అద్భుతం గ తప్పులు లేకుండా మీకై మీరు స్వంతగా తీయ దలచుకున్న సరే, లేదా పట్టభద్రుల వలెనే ఫోటో లను తాయారు చేయ దలచుకున్నా సరే, ఆ సృజనాత్మకత ను నేర్పుతుంది.

ఇందులో భాగాలు : 

డిజిటల్ వైపు పయనం :- అతి సాధారణ విషయాలు - కెమెరా లను ఎంచుకోవడం, వాటి వస్తువులు మరియు మొట్టమొదట తెలియ వలసిన విషయాలు.
మీ డిజిటల్ కెమెరా లను ఉపయోగించడం :- గొప్ప ఫోటో లను తీయడం ఎలా
డిజిటల్ డార్క్ రూం :- మీరు తీసిన అద్భుతమయిన ఫోటో లను కంప్యూటర్ సహాయం తోటి ఇంకనూ అద్భుతం గా మలచడం ఎలా
ప్రదర్శన :- ఆన్ లైన్ మరియు ప్రింట్ లలో అద్భుతమయిన క్వాలిటీ తీసుకు రావడం ఎలా ?

మీ డిజిటల్ ప్రయాణం ఇంక మొదలు. ఆనందించండి.

Friday, July 24, 2009

డిజిటల్ వైపు పయనం


ఈ భాగం లో మీరు మొదలు పెట్టడానికి అవసరమయిన మొత్తం పరిజ్ఞానాన్ని నేర్చుకుంటారు. అవి క్లుప్తంగా ...

  • మీకు సరియైన కెమెరా ని ఎంచుకోవడం ఎలా 
  • అతి చిన్న విషయాలు : డిజిటల్ కెమెరా లలో వుండే సదుపాయాలు (features), వాటిని ఉపయోగించడం, మరియు మీ కెమెరా ని భద్రపరచడం. 
  • కెమెరా ముఖ్య విషయాలు: మెమరీ కార్డ్స్, పవర్, లెన్స్ గురించి...
  • కంప్యూటర్ లు, ప్రింటర్ లు, సాఫ్ట్వేర్ లు మొదలగు వాటి మీద సూచనలు, వివరణ, ఉపయోగ విశదీకరణ. 
  • మెగా pixels, ఫోకాల్ లేన్గ్త్స్ ( focal lengths ), జూమ్ రేషియో లు, రకాలు, కెమెరా లలో వుండే మెనూ లు, వాటి అర్థాలు, మీరు మీ కెమెరా లను కంప్యూటర్ కి కన్నెక్ట్ చేసినపుడు డేటా ట్రాన్స్ఫర్ వేగం, గిగా బైట్లు, D-SLR లు, ప్లగ్ ఇన్ లు... మొదలగు వాటి గురించిన వివరణ.

కెమెరా లలో వుండే సదుపాయాలు, వివరణ : డిజిటల్ కెమెరా లు అసలు ఏ మాత్రం రీలు కెమెరా లు ఉపయోగించిన అనుభవం వున్నా వారికయినా అర్థం కా గలిగే లా రూపొందిస్తారు. ఇంకనూ, చాల ఎక్కువ సదుపాయాలను పొందు పరచి తాయారు చేస్తారు. చాల వరకు అన్ని డిజిటల్ కెమెరా లు సాధారణం గా ఒకే విషయాలను కలిగి వుంటాయి. ఇప్పుడు మీకు అత్యంత సాధారణ చిన్న డిజిటల్ కెమెరా లలో వుండే విషయాలను తెలియ పరుస్తాం. మెల్లిగా వాటి గురించి వివరిస్తాం. తర్వాత ఇంకా ప్రత్యేకమయిన విషయాలను తెలుసుకుందాం. వీటితో పాటుగా మీరు వస్తు సంబంధమయిన విషయాలు తెలిసుకో గోరితే, మీ కెమెరా తో పాటుగా వచ్చే పుస్తకాన్ని చదువ వలసి వుంటుంది. దానిలో మీ కెమెరా కి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం పొందు పరుస్తారు. ఇంకా వాటి ఆన్ లైన్ పగెస్ లో వాటిని గురించిన సంక్షిప్తం సమాచారం వుంటుంది. ఉదాహరణ గా ఈ పేజి చుడండి... అది ఫ్యుజి ఫిలిం a303 ని గురించిన మొత్తం సమాచారం కలిగి వుంటుంది.

ఒక పక్క నుంచి చూసినపుడు : ( Explanation about PC/AV Socket, DC ( Mains) Power socket )


ముందు నుంచి చూసినపుడు...
 













వెనుక నుంచి చూసినపుడు...




1. ఆటో ఫోకస్ సెన్సార్: కెమెరా లు ఒక ప్రత్యేకమయిన గ్రాహకాలు వాడతాయి. అవి వాటికవే ద్రుష్టి ని తగిన రీతి లో కేంద్రీకరిస్తాయి. ఒక విధమయిన గ్రాహ్యం కాంతి ని బట్టి గ్రహిస్తుంది. కాంతి లో మార్పులను బట్టి రంగులను గ్రహిస్తుంది. ఇంకొన్ని కెమెరా లు ఇన్ఫ్రా రెడ్ ని ఉపయోగించి గ్రహిస్తాయి., ఆధునిక కెమెరా లు ఈ రెండు సదుపాయాలు కలిగి వుంటాయి కూడా.  

2. ఇమిడి వుండే ఫ్లాష్ : చాలా మటుకు కెమెరా లు ఒక ఫ్లాష్ ని వాటిలో ఇమ్డుచుకుని తాయారు చేయ బడతాయి. ఫ్లాష్ అంటే ఫోటో తీసేటపుడు వెలుతురు కోసం ఒక కాంతి వంతమైన బల్బ్ అనమాట. అది ఫోటో తీసేటపుడు తీసే దృశ్యం మీద కాంతి వెదజల్లుతుంది.దానితోటి, తీసే దృశ్యం చాలా చక్కగా వస్తుంది ఫోటో లో. ఈ ఫ్లాష్ రాత్రులు వెలుతురు కోసం, లేదా పగలే అంట గ వెలుతురు లేని చోట ఫోటో తీసేటపుడు ఉపయోగించ వచ్చు.

3. ద్రుష్టి ని కని పెట్టేది : ( View Finder ) :  కెమెరా ద్రుష్టి ని కేంద్రీకరించి, అది నిజం గా ఎటు చూస్తుందో తెలుసుకోవడానికి ఒక చిన్న అద్దం వుంటుంది. దానిలో నుంచి చుస్తే తీయ బోయే ఫోటో లో ఏమేమి కనపడతాయో వురామరి గా చూపిస్తుంది. దీనిలో రెండు రకాలు. ఒకటి ఎలక్ట్రానిక్, ఇంకొకటి ఆప్టికల్. ఎలక్ట్రానిక్ వి అయితే, వాటిలో కొన్ని మార్కింగ్ చేసి తీయబోయే ఫోటో ఎలాంటిది వస్తుందో కొంత మెరుగయిన వివరం తోటి తెలియ పరుస్తుంది. ఆప్టికాల్ అంటే దాన్లో నేరుగా మనమే కాంతి తోటి చూసి అర్థం చేసుకుంటాము.



మీకు ఒక ఫోటో తీసేటపుడు చేసే దూరం గ చూపించడం, దగ్గరగా చూపించడం ఎలా వీలవుతుందో, అందుకు కెమెరా లలో ఎటువంటి అద్దాలని ఉపయోగిస్తారో తెలుసుకోవాలని అనిపిస్తే,  ఈ పేజి ని చుడండి.

కొన్ని డిజిటల్ కెమెరా లలో ఫోటో లు, వీడియో లు కూడా తీయ వచ్చు.
ఎన్ని రకాల సదుపయలున్నాయో, ఈ ఎడమ ప్రక్క చూపినటువంటి నోబ్ వుంటుంది. దానిలో చూసుకో వచ్చు.



4.మణి కట్టు కు కట్టుకునే ఏర్పాటు:  ఒక గట్టి మందమయిన నాజుగ్గా వుండే నయ్లన్ దారం తోటి మని కట్టుకు కెమెరా ను కట్టుకోవడానికి వుండే ఏర్పాటు. 
5. అద్డాలు ( Lens ): చాలా కెమెరాలు లెన్స్ తోటి వస్తాయి. అంటే వాటి సహయంతోటి మనం తీయబోయే ఫోటో లో వస్తువును దగ్గరగా కనపడేట్టు తీయ వచ్చు. లేదా దగ్గర గా వున్నా వస్తువును దూరం గా వున్నట్టు తీయ వచ్చు. వీటితో టి zoom in లేదా zoom out అనే పనులు చేయ వచ్చు.

Thursday, July 23, 2009

సాధారణ డిజిటల్ కెమెరా

ఒక అతి సాధారణ డిజిటల్ కెమెరా మీకు మంచి ఫోటో లను తీయడానికి కావలసిన అన్ని హంగులూ కలిగి వుంటుంది. మీరు ప్రత్యేకంగా చేయవలసినదేమి వుండదు. కెమెరా ని ఒక వస్తువు మీద దృష్టిని పెట్టించి, ఫోటో తీసేయడమే. వీటిని "చూపించు - మరియు తీయి" అనే కెమెరా లు అంటారు. అన్ని కంట్రోల్స్ ఆటోమాటిక్ గా వుంటాయి. అతి కొద్దివి మాత్రమే వుంటే గింటే, మనం సొంతగా చేత్తో చేయ వలసినవి వుంటాయి. వీటిలో ఆటోమాటిక్ గా ఎంచుకో గలిగిన ఫోటో ల రకాలు కూడా వుంటాయి. ఉదాహరణ కి ల్యాండ్ స్కేప్ (ప్రకృతి ఫోటోలు), పోర్త్రైట్ (మనుషుల బొమ్మలు), లాంటివి వుంటాయి. ఒక నిర్దిష్టమయిన ఫోకాల్ లెంగ్త్ గాని ( అంటే జూమ్ చేయలేనిది ) లేదా ఆధునికమయిన జూమ్ లెన్స్ లు గాని కలిగి వుంటాయి. రిసోల్యుషన్ బహుశా 3 MP 1 చుట్టు ప్రక్కల వుంటుంది. కొన్నింటికి అటు ఇటు గా వుంటుంది. ( రిసోల్యుషన్స్ గురించి తెలుసుకో గోరే వారు ఎన్ని మెగా పిక్సెల్సు ?? అనే భాగం చూడండి. సాధారణ వుపయోగాలకి ( అంటే స్వంత అవసరాల కోసం ) ఒక 2 MP కెమెరా అయితే చాలు. అటువంటి కెమెరా తోటి మనం ముద్రించాలన్న కూడా ఒక 6X4 ముద్రణ చక్కగా వస్తుంది. అంతకంటే ఎక్కువ ముద్రణ నిడివి ( కొలత ) కావాలంటే, మీరు 3MP లేదా అంతకన్నా ఎక్కువ MP వుండే కెమెరా ని కొనుక్కో వలసి వస్తుంది.

Wednesday, July 22, 2009

మధ్య తరగతి డిజిటల్ కెమెరా

ఈ కెమెరా లు కూడా సాధారణ కెమెరా ల వలెనే వుంటాయి. ఒక్క విషయం లో తేడా వుంటుంది. అది రిసోల్యుషన్. ఇంకా చెప్పుకోవాలంటే, ధర. ఒక మధ్య తరగతి హంగులున్న కెమెరా లో రిసోల్యుషన్ 3MP నుంచి 7MP వరకు వుంటుంది. ఎక్కువ శాతం వాటిలో ఒక ఆధునిక మయిన జూమ్ లెన్స్ అమర్చి తయారు చేస్తారు. అటువంటి జూమ్ లెన్స్ లు 3X జూమ్ రేషియో కలిగి వుంటాయి. ఈ మధ్య కలం లో వున్న విశేషమేంటంటే, ఈ మధ్య తరగతి కెమెరా లలోనే, ఆధునీకరించ బడిన, అబ్బుర పరచే విధం గా జూమ్ లెన్స్ లను అమర్చి తయారు చేస్తున్నారు. కాబట్టి ఒక డిజిటల్ కెమెరా ఒక నిర్దిష్టమయిన ఫోకాల్ లెంగ్త్ గల లెన్స్ నుండి, 10X వరకు జూమ్ లెన్స్ ని కలిగి వుండే అవకాశం లేక పోలేదు. వీటిలో మనం తెలుసుకొని వుండి, చేయ వలసిన కంట్రోల్స్ కొన్ని ఎక్కువ గానే వుంటాయి. వీటిలో మీకు ఫోటో లు మెరుగ్గా తీయ గలిగే కంట్రోల్స్ తో పాటు ఎక్కువ ఫోటో రకాలు, ( ల్యాండ్ స్కేప్, పోర్త్రైట్ వంటివి ), గుర్తించ దాగిన రంగుల వివరం, నాణ్యత, మొదలగు అంశాలు బాగా తయారు చేయబడి వుంటాయి.

Thursday, June 4, 2009

పట్టభద్రుల కోసం డిజిటల్ కెమెరా లు


 పని నేర్చుకుని, పట్టభద్రులయిన వారి కోసం ముఖ్యం గా తయారు చేయ బడిన ఈ కెమెరా లు (Prosumer / Bridge) బాగా ధర కలిగి, వాటికి తగ్గట్టు చాలా కంట్రోల్స్ మ్యాన్యువల్ గా అంతకంటే ఎక్కువ గా ఆటోమాటిక్ గా వుండే కంట్రోల్స్ కలిగి వుంటాయి. ఈ కెమెరా లలో లోపల మంచి కంప్యూటర్ సాఫ్ట్ వేర్  వుంటుంది. అది దృశ్యాలను తక్కువ సమయం లో గ్రహించి, పూర్తిగా భద్ర పరుస్తుంది. లెన్స్ ల జూమ్ రేషియో మాత్రం సాధారణ, మధ్య తరగతి కెమెరాల లానే వుంటుంది. వున్నా కూడా ఆ తేడ పెద్ద ముఖ్యం కాదు. కానీ, వాటి లెన్స్ లు మాత్రం ఆ కెమెరా తయారీ దారుల నైపుణ్యమయిన, అభివృద్ది చేసినవి అయి వుంటాయి. అవి కాంతి ని చాలా నాణ్యం గా గ్రహించే శక్తి ని కలిగి వుంటాయి. ప్రత్యెక మయిన కోటింగు, కొన్ని బాగా అభివృద్ది గాంచిన కాన్ఫిగరేషన్ లు కలిగి వుంటాయి. ఈ కెమెరాలలో 5MP నుండి 8MP వరకు వుండే అవకాశం వుండి, ఇంకా ఎక్కువ కూడా వుండ వచ్చు. వాటికి ఫ్లాష్ మార్చుకో గలిగిన తయారీ ఉంటుది. దీనితో, మీరు స్టూడియో తరహ ఫ్లాష్ లు కూడా పెట్టుకుని వాడుకునే అవకాశం వుండి. ( ఆ ఫ్లాష్ లు చిన్నవి గా వుంటే ). ఈ కెమెరా లలో ఒకటి కన్నా ఎక్కువ కనెక్షన్ లు వుంటాయి. వాటితోటి, తీసిన ఫోటోలను వేగం గా కంప్యూటర్ కి బదిలీ చేయ వచ్చు.

Thursday, May 7, 2009

డిజిటల్ ఎస్. ఎల్. ఆర్ ( D-SLR ) కెమెరా లు

డిజిటల్ ఎస్.ఎల్.ఆర్ కెమెరా అంటే ఆ కెమెరా లో ఒక అద్దం సహాయం తోటి తీయబోయే దృశ్యం కరెక్ట్ గా చూపిస్తుంది. ఈ పక్క బొమ్మ లో చూపించినట్టు ఒక రకమయిన అద్దం సహాయంతోటి. ఏ విధయయిన ఎలక్ట్రానిక్ అద్దాలు వాడదు. ఈ విధమయిన సదుపాయం మొత్తం ఒక సెకను లో వేల వంతు సమయాల్లో చేసేస్తుంది. దీంతో, సాధారణ కెమెరాలలో దృశ్యం పూర్తి గా చూపించడానికి మనం ఆగే సమయం ఇందులో అవసరం లేదు. దృశ్యం చూడగానే, ఈ కెమెరా ద్రుష్టి పెట్టేసి, దానిని కెమెరా వెనుక పక్క వుండే అద్దం లో నుండి చూపిస్తుంది. కాబట్టి, దీన్లో ఫోటో లు తీయడం చాలా వేగంగా జరుగుతుంది. ఈ సదుపాయం ఈ కెమెరా లకి ఈ పేరు తెచ్చి పెట్టినా, దీనితో పాటుగా ఇంకా కొన్ని చెప్పుకో వలసిన విషయాలు వున్నాయి. అవి :
  • కెమెరా లెన్స్ లని మార్చుకో వచ్చు. సందర్భానికి తగ్గట్టు గా వేర్వేరు లెన్స్ లను అతికించుకుని వాడుకో వచ్చు.
  • దృశ్య గ్రాహకాలు చాలా ఎక్కువ సామర్థ్యం తోటి, మరియు నాణ్యం గా తయారు చేయ బడతాయి.
ఈ విధమయిన సదుపాయాల వలన మనం అత్యంత నాణ్యమయిన ఫోటో లు అన్ని సందర్భాలలో తీయవచ్చు. అది కూడా అతి కొద్ది సమయాల్లోనే. ఇంకనూ ఒక విషయం... వీటి వస్తువులు చూడ ముచ్చట గానూ అప్పుడే అభివృద్ధి చేసినవి గాను వుంటాయి. కాబట్టి అవన్నీ మంచి ఫోటోలు నాణ్యమైన వివరం తోటి వచ్చే విధం గా తోడ్పడతాయి. వీటి రిసోల్యుషన్ లకు ఇంక ధోకా యే  లేదు. ఇవి 6MP నుండి మొదలుకుని,  22MP  వరకు లభ్యమవుతాయి. 

వీటన్నిటితో పాటుగా రాయి లాంటి బిగువు, బిర్రుగా వుండే విధం గా తయారు చేయ బడిన దేహం, మనకు విపరీతమయిన వాతావరణాలలో ఫోటో లు తీయడానికి ఉపయోగ పడతాయి. వీటి లెన్స్ ల మీద దుమ్ము పడ్డా కూడా చక్కగా కాంతిని గ్రహించే లాగా తయారు తయారు చేస్తారు. మబ్బుగా వుండే సందర్భాలు, మంచి తుఫాన్ లాంటి సందర్భాల్లో దీనిని వాడొచ్చు. వీటి బటన్లు , కవర్లు (తొడుగులు) మట్టికి, తడికి తొందరగా పాడు కాకుండా తయారు చేయ బడతాయి.

ఇవే డిజిటల్ కెమెరా ల విభాగం లో అత్యంత ఖరీదయినవి. బ్రిడ్జి కెమెరా లు వీటి లగే వుంటాయి కానీ, ఇవి వేరు అనే విషయమా మీరు గుర్తు పెట్టుకోవాలి.

Wednesday, April 1, 2009

ఎన్ని మెగా పిక్సెల్సు ? MP, The Mega Pixel buzz

అమ్మకం దారు మాటలు వినే సందర్భం లో మీరు తరచూ గా ఈ మెగా పిక్సెల్స్ అనే పదం విరివిగా వాడడం గమనిస్తారు. ఇవి చాలా ముఖ్యమయిన అంశం. అందుకని ఈ ఉత్తరం లో మీకు అవంటే ఏంటో, మీకేన్ని కావాలో, వివరిస్తాం.

ఒక డిజిటల్ కెమెరా ఒక ప్రత్యేకమయిన గ్రాహ్యము ( Sensor ) ని కలిగి వుంటుంది. దీనినే శాస్త్రీయ పద్దతి లో CCD అని పిలుస్తారు. (Charge Coupled Device)  అంటే దీన్లో విద్యుత్ నిల్వ ఉంచిన పదార్థాల్ని ఇరికించి తయారు చేస్తారు. ఇది సంప్రదాయక ఫిలిం ఎదైతో వుందో, దానికి బదులు అనమాట. మనం ఏ ఫోటో లు తీయాలన్న దీనిలో నేరుగా తయారు చేయ బడతాయి. ఈ గ్త్రాహ్యము అనేకనేకమయిన దృశ్య గ్రహకాలని కలిగి వుంటుంది. ఇవి వివిధ రకాలయిన కాంతి ని గ్రహించి, ఆ కాంతి ని ఎలక్ట్రానిక్ రూపం లోకి మర్చి, దాని కెమెరా లో వుండే కంప్యూటర్ కి ఇస్తుంది. ఇహ ఇప్పుడు ఫోటో తయార్. నేరుగా తీసిన ఫోటో ని కెమెరా రంగుల స్క్రీన్ మీద గాని, లేదా కంప్యూటర్ కి తగలించి నేరుగా కంప్యూటర్ లోనయిన చూసుకోవచ్చు. లేదు మనకి ముద్ర ప్రతి కావాలంటే, నేరుగా ముద్రించుకోవచ్చు కాగితం మీద. డిజిటల్ కెమెరా తోటి ఫోటో తీయడం అంత తేలిక.

ఒక పిక్చర్ ఎలిమెంట్ ( పిక్సెల్ ) అనేది ఒక అతి సుక్ష్మమయిన, సస్త్రయుక్తంగా విభజించ గలిగిన స్తలం. అది డిజిటల్ కెమెరా ల లోని విద్యుత్ గ్రాహకాల ద్వారా, కాంతి ని ఎలక్ట్రానిక్ రూపం లో కెమెరా లోకి పంపించ గలుగుతుంది. ఇటువంటి పిక్సెల్సు ఎన్ని లక్షలు వున్నాయి ? అనేది ఈ ఎన్ని మెగా పిక్సెల్సు ? అన్న ప్రసన కి సమాధానం. ఒక మెగా పిక్సెల్ అంటే, పది లక్షల కాంతి గ్రహకాలనమాట.  మెగా అంటే 10 లక్షలు అని. ఒక మెగా పిక్సెల్ కెమెరా అంటే 10 లక్షల కాంతి గ్రాహకాలు వున్న కెమెరా అనమాట. దీనినే సులువు గా 1MP కెమెరా అంటారు. అంటే 2MP కెమెరాలో 20 లక్షల కాంతి గ్రాహకాలు ఉంటాయన మాట.

ఈ సంఖ్యా చాలా ముఖ్యమయినది. ఎందుకంటే, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్సు వుంటే అంత వివరమయిన ఫోటో తీయవచ్చు. అప్పుడు ఆ ఫోటో లకి రిసోల్యుషన్ ఎక్కువ వుండి అంటారు. రిసోల్యుషన్ అంటే వివరం. పెద్ద తనం. ఇంకొక విషయం ఏమంటే ఎక్కువ మెగా పిక్సెల్సు వుంటే, పెద్ద ముద్రణ కి అవకాశం వుంటుంది. కాగితం మీద ముద్రించాలంటే, ఎక్కువ మెగా పిక్సెల్సు తోటి తీసిన ఫోటో అవసరం. మెగా పిక్సెల్స్ పెరిగే కొద్ది ధర పెరిగే అవకాశం వుందని మీరు గుర్తు పెట్టుకోవాలి.

కాబట్టి, మీరు ఎన్ని మెగా పిక్సెల్సు వుండే కెమెరా కొనాలి ? అనే ప్రసన కి సమాధానం మీ వద్దనే వుంటుంది. మీరు ఏ విధంగా మీ కెమెరా ని వాడతారు ? అనే దాన్ని  బట్టి వుంటుంది. మీరు మాములు గా ఇంటర్నెట్ లో ఫోటో లు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించుకోవడానికే అనుకోండి, మీకు తక్కువ మెగా పిక్సెల్సు డి సరి పోతుంది. (2Mp, 3Mp లాగా). ఈ మెయిల్ లో ఫోటో లు పంపించడం గురించి కావాలంటే, ఈ భాగాన్ని చూడండి  ముద్రణ కోసం కావాలంటే అంతకన్నా ఎక్కువ కావలసి వుంటుంది. మీకు 6x4  అంగుళాల ఫోటో ముద్రణ కావాలంటే, ఒక 2MP  డి సరిపోతుంది.దానినే కొన్ని సార్లు, 8x10 అంగుళాల వలె సగ దీయవచ్చు. ఒక 3MP కెమెరా తోటి ఒక A4  సైజు ముద్రణ ప్రతి ని తయారు చేయ వచ్చు. అదే  4MP దానితోటి A3 సైజు  ముద్రణ చేయవచ్చు.

అందుకని, ఒక 2MP కెమెరా సరిపోతుంది కానీ, మీరు జర్నలిస్ట్ అయ్యో, లేదా ముద్రణ మీద ద్రుష్టి పెట్టవలసిన వారో అయితే మాత్రం, 2MP  ది సరి పోదు. మీరసలు కాగితం ప్రతులే ముద్రించని వారయితే, 2MP - 4MP కెమెరా తీసుకో వచ్చు. ఈ పరిజ్ఞానమంతా పట్టించుకోవలసిన పని లేదు.


ఇక్కడ ఒక ఆనందించ దగ్గ విషయం వుండి. అదేంటంటే, ఎక్కువ మెగా పిక్సెల్సు వున్న, మనకి అవసరం లేక పొతే, వాడకుండా, తక్కువ మెగా పిక్సెల్సు మాత్రమే ఉపయోగించే విధంగా కెమెరా లలో సదుపయలుంటాయి. కాబట్టి మీరు ఎక్కువ కొనాలనే కుతూహలం తోటి కొన్న పరవాలేదు. దీని మీద ఇంట వివరం ఎందుకంటే, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్స్ తోటి ఫోటో తీస్తే, అంత జ్ఞాపకాన్ని మీ కెమెరా వాడుకుంటుంది. ఎంత ఎక్కువ మెగా పిక్సెల్సు ఫోటో తీస్తే అంత వివరం ఇముడుతుంది మన ఫోటో లో. అలాగే అంటే జ్ఞాపక శక్తి ని తినేస్తుంది. మన దగ్గర జ్ఞాపక శక్తి ( కెమెరాలలో పెట్టేది ) కార్డు అయి పొతే, అనవసరంగా దిగులు పద వలసి వుంటుంది. అందుకని, పొడుపు గా, పొందిక గా వాడుకోవాలి ఈ మెగా పిక్సెల్స్ అనే సంఖ్యని. 

Sunday, March 1, 2009

ఎక్కువ, తక్కువ రిసోల్యుషన్ ల ఫోటో లు, వాటిలో తేడాలు.

ఒక 35 MM ఫిలిం ఫోటో ( అదే మనం శివ శక్తి - 35MM థియేటర్ లో చూసేది ) ఒక ఫ్రేం 30MP కెమేరా తోటి తీసిన ఫోటో తో సమానం. కానీ అన్ని విషయాలు అంకెల గురించే కావు లెండి. మన (మానవుల) కళ్ళు ఒక చేయి అంత దూరం లో చూడాలంటే, 3MP కెమేరా తో ఫోటో తీస్తే చాలు. చూడ గలుగుతాము. మనం ముందు చెప్పుకున్నట్లు ఒక కెమేరా గ్రాహ్యం మీద ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్స్ వుంటే అంత వివరంగా ఫోటో తీయ గలుగుతాము. కానీ అన్ని వేళల్లో మీకు అంత వివరం గ వుండే అవసరం వుండదు కదా.. ఒక ఫోటో దేని గురించో తెలిస్తే చాలు చాలా సందర్భాల్లో. సరే, ఒక పోలిక కోసం ఏ ఏ మెగా పిక్సెల్స్ తోటి ఎప్పుడెప్పుడు ఫోటో లు తీయాలో ఇక్కడ చూద్దాం.
ఒకే ఫోటో ని  6MP, 1.5MP, 0.3 MP ల లోకి మర్చి చూద్దాం... మనకి సులభం గ అర్థమవుతుంది దాని గురించి..
( ఫోటో లు ఇంకా పెట్టవలసి వుంది )

Sunday, February 8, 2009

జ్ఞాపక శక్తి మరియు జ్ఞాపక శక్తి కార్డ్ లు

ప్రతి డిజిటల్ కెమెరా ఏదో ఒక విధమయిన జ్ఞాపక శక్తి వాడుతుంది. కొన్ని సార్లు డిజిటల్ ఫిలిం అయి ఉండవచ్చు. అది మీరు తీస్తున్న దృశ్యాలను తనలో భద్ర పరచుకుంటుంది. ఈ జ్ఞాపక శక్తి ఎంత కావాలో, ఎలాంటిది కావాలో కొన్ని సూచనలు ఇక్కడ మీ కోసం పొందు పరుస్తున్నాం. చదవండి.

ఒక జ్ఞాపక శక్తి కార్డ్ - వివరణ : సులభంగా చెప్పాలంటే, జ్ఞాపక శక్తి అనేది ( డిజిటల్ ప్రపంచం లో ) ఒక చిన్న కంప్యూటర్ చిప్. ఇంగ్లిషు లో దాన్ని 'ఫ్లాష్ మెమరీ' అంటారు. అది మీరు తీసిన ఫోటో గురించిన మొత్తం దృశ్య వివరాన్ని తనలో భద్ర పరుచుకుంటుంది.ఇవి బయటికి తీసి వేరొక అటువంటి వాటిని పెట్టుకునే విధంగా కెమెరా లను తయారు చేస్తారు. కాబట్టి ఒక జ్ఞాపక శక్తి కార్డ్ నిండి పోయినపుడు, దాన్ని తీసి భద్రంగా పెట్టుకుని, ఇంకొక ఖాలీ జ్ఞాపక శక్తి కార్డు ని మీ కెమెరా లో పెట్టుకుని ఉపయోగించుకుంటారు. సాంప్రదాయ రీలు కెమెరా లలో లాగా ఫిలిం బయటకు తీయగానే ఫోటో లన్ని కాలి పోతాయి అనుకోకండి. మీరు తీసిన ఫోటో లు ఎక్కడికీ పోవు. అదే డిజిటల్ కెమెరా ల లోని సులువు దనం. పెద్ద చీకటి గది లోకి పోయి తీయవలసిన అవసరం ఇంక లేదు. వాటిని నేరు గా కొన్ని రకాల కంప్యూటర్ లలో పెట్టేసుకుని మీ ఫోటో లను చూసుకో వచ్చు. (కొన్ని రకాల నూతన కంప్యూటర్ లకి కార్డ్ రీడర్ అనే ఒక సదుపాయం వుంటుంది. దాన్లో మీ కార్డ్ ని పెడితే, కంప్యూటర్ అందులో వున్న బొమ్మలను మీకు చూపిస్తుంది).

కొన్ని డిజిటల్ కెమెరా లలో వాటితో పాటుగా ఒక జ్ఞాపక శక్తి కార్డ్ ని కూడా ఉంచుతారు. అది మహా అయితే, కొన్ని ఫోటో లు - మీరు అక్కడే మొదలు పెట్టి ఫోటో లను తీసి పరిశీలించేందుకు పనికి వస్తుంది. కొన్ని కెమెరా లలో కొంచెం ఎక్కువ నిల్వ సామర్థ్యం వున్నవి వుంటాయి. ఎలాగయినా మీరు కెమెరా కొన్న వెంటనే, దానికి తగ్గ జ్ఞాపక శక్తి కార్డ్ లను కొనుక్కోవలసి వుంటుంది. మీ కెమెరా కి సరి పోయే జ్ఞాపక శక్తి రకాల గురించి దానితో పాటు గా వచ్చే పుస్తకం లో వివరిస్తారు. మీరు జ్ఞాపక శక్తి కార్డ్ లు కొనే ముందు విధి గా అది చదువండి. లేక పొతే అనవసరమయిన వాటికి డబ్బు వెచ్చించే అవకాశం వుంది. అన్ని కెమెరాలకు అన్ని జ్ఞాపక శక్తి కార్డ్ లు సరి పోవు. జ్ఞాపక శక్తి కార్డ్ లు వాటి రకాల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఈ పేజి చూడండి.

జ్ఞాపక శక్తి కార్డ్ లు ఒక రెప్ప పాటు: జ్ఞాపక శక్తి కార్డ్ లు ఎన్నో రకాల నిల్వ సామర్థ్యాలతో వస్తాయి. వాటితో పాటు వాటి లో రకాలు కూడా ఎక్కువే. తర్యరి దారులు వారి కెమెరా కొన్న వారు వాళ్ళ కార్డ్ లానే కొనాలనే ఉద్దేశ్యంతో ఎవరికీ వారు ఏవేవో రకాలు తయారు చేస్తూ వుంటారు.
(సాధారణంగా ఈ ఉద్దేశ్యాన్ని - చాలా రకాల శాస్త్రీయ పద్దతుల వలన వేర్వేరు వస్తువులు తయారవుతాయి అని చెప్పి కప్పి పుచ్చుకున్తుంటారు. అప్పటికి, ప్రభుత్వాల్లోని ఒక పెద్ద మనుషుల సంఘం వుండి వాటిలో రకాలను అతి కొద్ది రకాలుగా ఉండేట్టు కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు.లేక పొతే కొనుగోలు దారులు - మనం కొనమని వారికీ తెలియ పరుస్తారు).

సరే, విషయం ఏదయితేనేం -- వీటి నిల్వ సామర్థ్యాలను మెగా బైట్లు లేదా గిగా బైట్లు (MB or GB) లలో కొలుస్తారు. 16MB నుండి 4GB వరకు వీటి సామర్థ్యం వుంటుంది. GB అంటే MB కన్నా ఎక్కువ. నిజానికి ఒక GB = 1024 MB. కాబట్టి 512 MB కార్డ్ అంటే 1GB కన్నా ఎక్కువ అనుకోకండి. ఈ నిల్వ సామర్థ్యం ఎంత ఎక్కువ వుంటే అన్ని ఎక్కువ ఫోటోలను మీరు అందులో నిల్వ చేయ గలుగుతారు.వాటి ధర వాటి నిల్వ సామర్థ్యం తో పెరుగుతుంది. ఈ బ్లాగు ప్రాచుర్యం లోకి వచ్చే సరికి చాలా అదునాతనమయిన కార్డ్ లు, ఫోన్ లలో నే ఫోటోలు తీయగలిగే సామర్థ్యాలు వుండ వచ్చు. కానీ, మంచి ఫోటోలు కావాలంటే మాత్రం, ఈ బ్లాగులో చెప్పిన విషయాలు తప్పని సరిగా ఉపయోగ పడతాయి. (పాటించ వలసి వుంటుంది కూడా).

కంపాక్ట్ ఫ్లాష్ (CF) - రెండు రకాలు : ఒక ముఖ్యమయిన జ్ఞాపక శక్తి రకం ఇది. ఇది డిజిటల్ కెమెరా లు పుట్టినప్పటి నుండి వాడుక లో వున్నాయి.వీటి నిల్వ సామర్థ్యం 4GB వరకు వుంటుంది.IBM మైక్రో డ్రైవ్ అనేది రెండవ రకం ఇందులో. ఇది దాదాపు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగే ఇంక. మంచి వేగం, ఎక్కువ సామర్థ్యాలతో తయారు చేయ బడుతుంది.




Secure Digital (SD) & Multi Media Cards (MMC): ఈ రెండు రకాల కార్డ్ లు ఒకే రకంగా గోచరిస్తాయి. కానీ అన్ని సందర్భాల్లో వీటిని కెమెరాలు గుర్తించవు. వీటి లోపలి తయారీ లో తేడా వుండడం వల్ల.  రెండోది MMC అనేది మల్టి మీడియా వివరాలను భద్రపరుచుకో గలుగుతుంది. అందుకే వీటిని జేబులో పెట్టుకునే ఫోన్ లలోను పాటలు పాడే వస్తువులలోను ఉపయోగించుకునే అవకాశం వుంది.
జ్ఞాపక శక్తి పుల్ల (Memory Stick - MS) : ఇది సోని కంపెనీ వారి స్వంత తయారీ వస్తువులలో వుంచి అమ్ముతారు. డిజిటల్ కెమెరాలతో పాటు కొన్ని రకాల టి.వి. లలో కూడా ఉపయోగిస్తారు.ఈ పుల్ల రకం లో ఇంక రెండు పిల్ల రకాలు వున్నాయి. అవి MS Pro, Duo, అనేవి.వీటి నిల్వ సామర్థ్యం 4GB వరకు వుంటుంది. కానీ కొనే ముందు మాత్రం మీ కెమెరా తో పాటు గా వచ్చే పుస్తకాన్ని చదువ వలసి వుంటుంది.
స్మార్ట్ మీడియా (SM) : సాధారణ నిల్వ సామర్థ్యాలతో వుండే వీటిని కొన్ని రకాల డిజిటల్ కెమెరా తయారీ దారులు వారి కెమెరాలలో పెట్టి అమ్మడానికి తయారు చేస్తారు. వీటి తయారీ సమీప భవిష్యతు లో ఆపి వేసే అవకాశం వుంది. అందుకని వీటిని మాత్రమే గుర్తించే కెమెరా లను కొనే ముందు జాగ్రత్త వహించండి.
xD పిక్చర్ కార్డ్ (xD): ఈ రకం జ్ఞాపక శక్తి కార్డ్ లు బాగా జనాదరణ పొందుతున్నాయి. ఒక ముఖ్యమయిన కారణమేమంటే, ఇవి చాలా చిన్నవి గా వుండడం వలన, కెమెరా తయారీ దారులు వారి కెమెరా లను చక్కగా, చిన్నవి గా తయారు చేయ గలుగుతున్నారు. ప్రస్తుతానికి, ఫ్యుజి, ఒలింపస్ అనే తయారీ దారులు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.సిద్ధాంత పరంగా వీటి నిల్వ సామర్థ్యం 4GB వరకు తయారు చేయ వచ్చు. ప్రస్తుతానికి ఇవి 512 MB వరకు లభ్యమవుతున్నాయి.

ఇప్పుడు : ఎటువంటి నిల్వ సామర్థ్యాన్ని మీరు కొనుక్కోవాలి ? : ఒక కార్డ్ లో ఎన్ని దృశ్యాలను భద్ర పరచవచ్చు అనే విషయం ఈ క్రింది వాటి మీద ఆధార పది వుంటుంది.
  • కార్డ్ నిల్వ సామర్థ్యం
  • కుక్క గలిగే సామర్థ్యం (compression level) - ఇది తయారీ దారులను బట్టి మారుతూ వుంటుంది.
  • మీరు ఒకొక ఫోటో కి చేసే మార్పులు. - రిసోల్యుషన్ లు, రకాలయిన ఫోటోలను తీయడం.
  • ఇంకా, మీ కెమెరా CCD మీద కాంతి గ్రాహకాల (మెగా పిక్సెల్) సంఖ్య
 ఒక ఉదాహరణ గా ఒక చిన్న లెక్క వేసుకుందాం... ఒక మాములు 3MP కెమెరా తోటి వచ్చే మాములు 16MB కార్డ్ లో 20 'మాములు' ఫోటో లను నిల్వ చేయ వచ్చు.అదే ఎక్కువ నాణ్యమయిన ఫోటో లు కావాలంటే, 3 నుండి 5 ఫోటోలను మాత్రమే నిల్వ వుంచగలం. ఒక 32 MB కార్డ్ లో 10 మంచి నాణ్యమయిన ఫోటో లను నిల్వ చేసుకో వచ్చు.ఒక 128 MB కార్డ్ 30 నాణ్యమయిన ఫోటో లను నిల్వ ఉంచుకో గలదు. ఈ లెక్కలు తెలుసుకొని మీరు ఒకే ఓకే ఎక్కువ సామర్థ్యం గల కార్డ్ కొనుక్కోవడానికి ఆకర్షితులవ వచ్చు. కానీ మీరు అలా చేయడం అంత ఉపయోగ కరం కాదు. ఎందుకంటే, అన్ని ఫోటో లు ఒకే కార్డ్ లో పెట్టితే దురదృష్ట వశాత్తు, అది ఏదో కారణం చేత చెడి పోతే ? ఒక మంచి విహార యాత్ర కి వెళ్లి అద్భుతమయిన ఫోటో లను తీసుకుని వచ్చేటపుడు ఆ కార్డ్ చెడిపోతే, అంతకన్నా చెత్త విషయం మరొకటి వుండదు. అందుకని ఈ క్రింది విషయాలను గుర్తు పెట్టుకోండి.
  1. కొన్ని కెమెరా లు ఒకటి కన్నా ఎక్కువ రకాల కార్డ్ లను గుర్తించ గలవు. కాబట్టి ధరల విషయం లో ఏమయినా తక్కువ కు వచ్చేట్టు వుంటే, వేర్వేరు రకాలవి కొనుక్కోవచ్చు. 
  2. తక్కువ నిల్వ సామర్థ్యం వి ఎక్కువ కొనుక్కొని భద్రపరుచుకోండి. ఉదాహరణ గా 4GB నిల్వ సామర్థ్యం కావలసినపుడు, ఒక 2GB ది, 2 512 MB వి, మిగతావి 16,32,128 MB వి కొనుక్కోండి. అలా చేయడం వల్ల  అన్ని ఫోటోలను ఒకే దాంట్లో పెట్టుకొనే అవకాశం వుండదు.

Thursday, January 8, 2009

కొనుగోలు దారుడికి సూచనలు

ఎన్నో రకాల సదుపాయాలు, ధరల చిట్కా మంత్రాలతో మిమ్మల్ని ప్రతి తయారీ దారుడు కూడా ఊరిస్తూ వుంటాడు. వాటికి ప్రలోభ పడకుండా, 'మీకేమి' కావాలో ఎంచుకునేందుకు ఒక పరిజ్ఞానం తో కూడిన వివరణ ఇచ్చాం. చదివి తెలుసుకోండి.

డిజిటల్ కెమెరా కొనలనుకున్నపుడు మీరు చేయ వలసిన మొట్ట మొదటి పని : అంశాల వారి గా మీకు కావలసిన సదుపాయాలు నెమరు వేసుకోవడం, తర్వాత మీ స్తోమత ను బట్టి ధరకి అనుగుణం గా కట్టుబడి చేస్తుకోవడం.

దేనికి ఖర్చు పెట్టాలి ? : ఇక్కడ చెప్పుకోబోయే విషయాలు ధరల విషయానికొస్తే కొంచెం అటు ఇటు గా అన్నీ ముఖ్యమయినవి. 

  • మానవుడు తయారు చేసే అన్ని విషయాల లాగా డబ్బును బట్టి వస్తువు వుంటుంది కాబట్టి, మొట్ట మొదటి గా మేము డబ్బు గురించి మరీ పొడుపు గా సూచించినా కూడా మీరు కొంచెం ఉదాసీనత వహించండి. కానీ మీకు కావలసిన సదుపాయాలు వుంటే మాత్రమే కొనేటట్టు మనసును కట్టడి చేసుకోండి.
  • మంచి జ్ఞాపక శక్తి నిల్వ వుండే కార్డ్ లను కొనేందుకు సిద్ధం కండి. 
  • సాధ్యమయినంత వరకు ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్సు వి కోన గలిగితే, అన్ని కొనండి. అవసరం లేనపుడు, జ్ఞాపకశక్తి నిల్వ ని ఆడ చేసేందుకు, తక్కువ మెగా పిక్సెల్స్ వాడె సదుపాయం దాదాపు అన్ని కెమెరాలలో వుంటుంది.
  • ఒక మంచి కలర్ స్క్రీన్ ఉండేట్టు చూసి కొనుక్కోండి. దానిలో మీరు ఫోటో తీయబోతూ, తీసిన తరువాత ఎలా వచ్చిందో, చూసుకోవడానికి బాగా వుంటుంది. కొన్ని కొన్ని సార్లు ఇది లేక పోతే మంచి ఫోటో లు కోల్పోయే అవకాశం వుంది.

మీకు ఏమి కావాలి ? కొనే ముందు మీరు మీ డిజిటల్ కెమెరా తోటి ఏమి చేయ దలచుకున్నారో నిర్ణయించుకోండి. తరువాత మీకు కొనడం చాలా సులభం అవుతుంది. ఎక్కువ శాతం కెమెరా వాడకం దారులు ఈ విధాలుగా వారి కెమెరాలను వాడతారు. 
  • ఇంటర్నెట్ లో పెట్టుకోవడానికి
  • ఈ మెయిల్ పంపించుకోవడానికి, వాటితో వారి ఫోటోలను పంపుకోవడానికి
  • వారి కంప్యూటర్ ల మీద ఆల్బమ్స్ తయారు చేసుకొని చూసుకోవడానికి
  • ఫోటో లను ముద్రించి ప్రచురించుకోవడానికి 
  • ఇంకా వివిధ రకాలుగా తయారు చేసి డబ్బు సంపాదించుకోవడానికి. 
కొన్ని డిజిటల్ కెమెరా లు పైన చెప్పిన పనులన్నింటికీ అద్భుతం గా సరి పోతాయి. మరి కొన్ని పైన చెప్పిన యే పనులకు కూడా పూర్తీ గా సరి పోవు. ఈ విషయం కెమెరా కొనే వారికీ కావలసిన మొట్ట మొదటి పరిజ్ఞానం :) 
అన్ని అంశాలను చూసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్ధమవుతుంది. అదేంటంటే, ఎక్కువ మెగా పిక్సెల్స్ వుంటే ఎక్కువ నాణ్యమయిన ఫోటోలు తీయ వచ్చు మరియు అలా తీయడానికి పనికి వచ్చే అన్ని సదుపాయాలను ఆ కెమెరా కలిగి ఉండేలా తయారు చేస్తారు. ఈ విషయం ద్రుష్టి లో పెట్టుకుని, మంచి నమ్మకం దారుడి వద్ద అన్నే సరి చూసుకొని, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్స్ వుండేది కొనగలిగితే, అన్ని మెగా పిక్సెల్స్ వుండే కెమెరా ని కొనుక్కోండి.

1MP నుండి 2MP వరకు వుండే కెమెరాలు : ఈ తరహ కెమెరా లు అత్యంత మాములు వి. వీటి తో తీసిన ఫోటో లు చిన్న స్తలాన్ని ఆక్రమించుకుని జ్ఞాపక శక్తి కార్డ్ లలో ఇమిడి పోతాయి. వీటిని ఇంటర్నెట్ లో పంపించడం చాలా తేలిక. వీటితో ముద్రించా దలిస్తే మాత్రం ఎక్కువ లో ఎక్కువ 8x10 అంగుళాల వరకు సగ దీయ వచ్చు. ఇవి మెల్లగా కల గర్భం లో కలిసి పోయే అవకాశం వుంది. ( ఎందుకంటే, వినియోగాదరుఅకి ఈ ఫోటో ల మీద అంత గా మోజు లేదు. ) కాబట్టి, ఇవి కొనే ముందు, ఒక సరి మీ అవసరాన్ని సరి పోల్చుకోండి. వీటి స్తనం లో 3MP నుండి 4MP వి వచ్చి చేరతాయి.
3MP నుండి 4MP వరకు వుండే కెమెరా లు: ఇవి అత్యంత జనాదరణ పొందిన కెమెరా లు. ధర పరంగా కూడా ఇవి అంత ఖరీదయినవి కావు. ఇవి విరివి గా వాడుక లో కూడా వున్నాయి. 3MP వి ముద్రణ సామర్థ్యం, వివరమయిన ఫోటో లు తీయగాలిగినవాయి వుంటాయి. 4MP వి ఎక్కువ సైజు ముద్రణ సామర్థ్యం తో పాటు మీరు తీసిన పోహోతో లను ఇంకా అద్భుతంగా తయరు చేసేందుకు కావలసిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి. ఇవి అన్ని రకాల సాధారణ మయిన అవసరాలకు అత్యంత అనువయినవి గా పరిగనించ బడతాయి.
5MP మొదలుకుని, ఇంకా ఎక్కువ : ప్రస్తుతం నడుస్తున్న పరినమమేంటంటే, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్స్ వుంటే అంత గొప్ప. దీనికి సమర్ధించే విందాం గా ఎక్కువ మెగా పిక్సెల్ వుండే కెమెరా లు అత్యంత వివరమయిన ఫోటో లు తీయ గలగడం వలన వాటి ని చూసేందుకు బాగుంటాయి. ఎక్కువ సైజు ముద్రణ కూడా చేయ వచ్చు. అలా లెక్క వేసుకుంటూ పోతే, ఒక 8MP కెమెరా తో తీసిన పోహోట్ తోటి A2 సైజు ముద్రణ ప్రతి చేయ వచ్చు. ( ఈ A4,A3,A2 అంటే ఏమిటి అనే వివరణ కింద ఇచ్చాం, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.) ఈ కెమెరా లు కొంచెం ఖరీదయినవి. ఒక వేల మీ వద్ద డబ్బు వున్న కూడా, మీరు ముద్రణ మీద ద్రుష్టి పెట్టె వారు కాక పొతే, మీరు వీటి ని కొనడం పెద్ద అవసరం లేదనే చెప్పాలి.


చిట్ట చివరిగా , ఈ రోజుల్లో, అందరు మంచి నాణ్యమయిన, వివరమయిన ఫోటో ల వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి, ఎన్ని ఎక్కువ మెగా పిక్సెల్స్ వున్న కెమెరా కొన గలిగితే అంత కెమెరా ని కొనమనడం (కొంతవరకు) మా ఉద్దేశ్యం .


A4,A3, A2 మొదలగు వాటి గురించి...


ఇక్కడ A4 అనేది ఒక సాధారణ ఠావు పేజి. దానితో పోల్చుకుంటే, మీకు మిగతావి సులభం గా అర్థమవుతాయి.